సక్సెస్‌ఫుల్ గరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో పి.సురేఖ నిర్మించిన చిత్రం ‘గరం’. ఫిబ్రవరి 12న విడుదలయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మదన్ మాట్లాడుతూ, సినిమా మొదటి ఆట ప్రేక్షకుడు దేవుడితో సమానమని, మేము రూపొందించిన ‘ఆ నలుగురు’ సినిమాకు మొదటి రెండు వారాలు కలెక్షన్స్ లేవని, మూడవ వారానికి కలెక్షన్స్ రావడం మొదలుపెట్టాయని అన్నారు. అలానే ‘గరం’ సినిమా కూడా వౌత్ టాక్‌తో రెండు రోజులనుండి జనాల్లోకి వెళ్లిపోయిందని, సినిమాగురించి నెగెటివ్‌గా ఒక్కరుకూడా చెప్పలేదని, ‘ఆ నలుగురు’ సినిమాలో రఘురాం పాత్ర అందరికి ఎలా గుర్తుండిపోతుందో ఈ సినిమాలో వరాలబాబు పాత్ర అలా గుర్తుండిపోతుందన్నారు. ఆది మాట్లాడుతూ, మాస్ హీరోగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో సినిమా చేశానని, థియేటర్‌లో సినిమాకు వచ్చే రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాననే నమ్మకం నాలో ఏర్పడిందని, సినిమా టాక్ రోజురోజుకి పెరుగుతుందే కాని తగ్గదని, ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. సాయికుమార్ మాట్లాడుతూ, సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని, మంచి ఓపెనింగ్స్‌తో మొదలై ఈ రోజుకి కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. నిన్నటికంటే ఈ రోజు కలెక్షన్స్ పెరిగాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైతన్యకృష్ణ, నరేష్, అగస్త్య, ఆదాశర్మ తదితరులు పాల్గొన్నారు.