ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ 1989

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంగ్ల సంగీత ప్రపంచానికి ‘ఆస్కార్’ లాంటి గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్‌ఎంజిలిస్ స్టాపిల్ సెంటర్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో గతేడాది విడుదలైన పాప్, రాక్, మ్యూజిక్, ఆల్బమ్‌లకు సంబంధించి 83 విభాగలలో అవార్డులు బహూకరించారు. వీటిలో కీలకమైన ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రఖ్యాత అమెరికన్ పాప్ గాయని టేలర్ స్విఫ్ట్ ‘1989’ ఆల్బమ్‌ను వరించింది. బెస్ట్ మ్యూజిక్ వీడియో విభాగంలోనూ కెండ్రిక్‌తో కలసి ఆమె రూపొందించిన ‘బాడ్‌బ్లడ్’కు దక్కింది. ఇక సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా ‘్థంకింగ్‌ఔట్ లౌడ్’ (ఎడ్‌హీరన్, అమీలెడ్జ్)కు దక్కగా రికార్డ్ ఆఫ్ ఇయర్ అవార్డును బ్రూనోమార్స్, మార్క్‌రాలకు ‘అప్‌టౌన్ ఫంక్’ కు ప్రకటించారు. ఉత్తమ కొత్త సంగీత కళాకారునిగా మెఘన్ ట్రెయినర్‌ను అవార్డు వరించగా బెస్ట్ రాప్ ఆల్బమ్‌గా ‘టుపిక్స్ ఎ బటర్‌ఫ్లై’కు గాను కెండ్రిక్ లాకుర్‌కు దక్కింది. బెస్ట్ కంట్రీసాంగ్-లోరీమెకన్నా, హిల్లర్, బెస్ట్ ఆర్ అండ్ బి సాంగ్-డిఎంజిలో, కెండ్రా ఫాస్టర్‌లకు, బెస్ట్ రాక్ పెర్ఫార్మెన్స్ అవార్డు డోన్ ఎన్నాపైట్, అలబామా హేక్‌కు లభించాయి. అలాగే బెస్ట్‌రాక్‌సాంగ్ (డోంట్ వన్నా ఫైట్) అలబామాకు, హేక్స్‌లకు దక్కగా బెస్ట్ డాన్స్ రికార్డింగ్, బెస్ట్ డాన్స్ ఎలక్ట్రానిక్ అవార్డులు స్కి ల్లిక్స్, డిప్లోలకు దక్కాయి.
కాగా బెస్ట్ ఫిల్మ్ మ్యూజిక్ విభాగానికి గాను భారతీయ మూలాలున్న సంగీత కళాకారుడు, దర్శకుడు అసిఫ్ కపాడియాకు గ్రామీ దక్కింది. ఈయన రూపొందించిన ‘అమీ’ చిత్రానికి ఈ పురస్కారం లభించింది. సితార ఆర్టిస్ట్ పండిట్ రవిశంకర్ కుమార్తె అనుష్క శంకర్ రూపొందించిన ఆల్బమ్ ‘హోమ్’కి గ్రామీ దక్కకపోవడం నిరాశపర్చింది. ఇప్పటివరకు ఆమె ఐదుసార్లు గ్రామీలో నామినేషన్‌కు అర్హత సాధించినా ఫలితం లేకపోయింది. కాకపోతే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన తొలి భారతీయురాలిగా ఆమె రికార్డు సాధించింది. ఇక పాప్‌గాయనీగాయకులు అవార్డుల ప్రదానోత్సవంలో అద్భుత ప్రదర్శనలిచ్చి సంగీతరంగ ప్రముఖులకు నివాళి అర్పించారు.