సీతగా గుర్తుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కొన్ని చిత్రాలు చేసినా అవి సరిగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఇప్పుడు చేసిన సీత.. రామునికోసం చిత్రం నాకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది అని కథానాయిక కారుణ్య తెలిపారు. అనిల్ గోపిరెడ్డి దర్శకత్వలో శరత్ శ్రీరంగం, కారుణ్య జంటగానటించిన ‘సీత.. రామునికోసం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయిక కారుణ్య చిత్ర విశేషాలు తెలిపారు. ‘‘ఈ చిత్రాన్ని నా డెబ్యూ సినిమాగా భావిస్తా. దర్శకుడు ఈ చిత్రంలో సీత పాత్రను వైవిధ్యంగా డిజైన్ చేశా. ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాముడి కోసం సీత ఏం చేసింది అనేది కథనం. టీజర్, ట్రైలర్ చూసినవారందరూ బాగుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమాతో నన్ను సీతగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. సినిమా చూసి బైటికి వచ్చే ప్రేక్షకులు పాజిటివ్ ఫీల్‌తో వస్తాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సినిమాలో స్క్రీన్‌ప్లే కొత్తగా వుంటుంది. హీరో శరత్, బేబి శాన్వి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. అన్ని వివరాలు త్వరలో చెబుతాను అంటూ ముగించారు.