సైరా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు అభిమానులు ఇటు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించనున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ బుధవారం అధికారికంగా సెట్స్‌కు వెళ్లింది. హైదరాబాద్‌లోనే నేటినుంచి డిసెంబర్ 22 వరకూ సినిమా కోసం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో ఏకధాటిగా షూటింగ్ జరగనుంది. ఈ క్రేజీ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ హిస్టారికల్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీపై నిర్మిస్తున్నారు.