22న టైగర్ జిందా హై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘టైగర్ జిందా హై’. కత్రీనా కైఫ్ ఇందులో సల్మాన్‌కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ‘స్వాగ్ సే స్వాగత్..’ అనే పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. పాట మొత్తంలో ప్రేమలేకపోతే జీవితమే లేదు అన్న విషయాన్ని ప్రస్తావించారు. స్వాగ్ సే స్వాగత్ అంటూ వచ్చే బీట్‌కి సల్మాన్‌ఖాన్, కత్రీనాకైఫ్ వేసి స్టెప్పులు హైలైట్‌గా నిలిచాయి. ఈ పాటకు సంబంధించిన ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం పాటలు విడుదలైన కొద్ది సేపటికే మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ నుంచి రాబోతున్న యాక్షన్ చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ చివరిరోజున అభిమానులకు మరో కానుక ఇచ్చాడు సల్మాన్. ఆయన తదుపరి చిత్రం ‘రేస్ 3’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ట్విట్టర్‌లో పంచుకొన్నాడు సల్మాన్. ‘రేస్ 3’ మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో సల్మాన్ సరసన జాక్వెలైన్ ఫెర్నాండెజ్ నటిస్తోంది. రెమో డిసౌజా దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ త్వరలోనే మొదలుకానుంది. ‘టైగర్ జిందా హై’ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతలా అంటే హిందీ ‘బాహుబలి-2’ ట్రైలర్‌ను మంచి లైక్‌లను సొంతం చేసుకుంది. తాజా గణాంకాల ప్రకారం ‘టైగర్ జిందా హై’ను 7, 22,00 మందికి పైగా లైక్ చేయగా, ‘బాహుబలి-2’ హిందీని ఇప్పటి వరకూ 5, 41,000 మంది మాత్రమే లైక్ చేశారు. ‘టైగర్ జిందాహై’ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. గతంలో సల్మాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’కు సీక్వెల్ ఇది. సల్మాన్‌ఖాన్, కత్రీనాకైఫ్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రంలో హాట్ హాట్ డ్రెస్‌లో కత్రీనా చేసిన సందడికి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలోని ‘దిల్ దియానా గల్లన్’ పాట కూడా అందరి హృదయాల్ని దోచుకుంటోంది. సల్మాన్, కత్రీనాకైఫ్‌ల మధ్య ప్రేమ సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. మంచు కొండల సమీపంలోని ఇంటిలో సల్మాన్, కత్రినా కనిపించారు. తెల్లటి మంచులతో రంగులతో కత్రినా పెయింటింగ్‌ను సల్మాన్ వేశారు. ఈ చిత్రంతో వీరి జంట మరోసారి వెండితెరపై మాయ చేయడానికి సిద్ధమైపోయిందని విమర్శకులు అంటున్నారు. ఆస్ట్రేలియాలోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన పాటను చిత్రీకరించారు. సల్మాన్, కత్రినా ఐదేళ్ల తర్వాత కలిసి నటించిన చిత్రమిది. ఇందులో సల్మాన్ టైగర్, కత్రినా జోయా పాత్రల్లో కనిపించనున్నారు. నిజానికి సల్మాన్, కత్రినా సినీ ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టే ప్రేమికులే. అయితే ఇద్దరూ కలిసి వెండితెరపై ప్రేమ వెనె్నల కురిపించి అయిదేళ్లయిపోయింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలిశారంటేనే అభిమానులకు ఉత్సాహం. ఆపై ప్రేమగీతాలు పాడుకుంటున్నారంటే ఇంకా ఆనందం. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఆధ్వర్యంలో చిత్ర బృందం కూడా హుషారుగా వుంది. ఈ సినిమాలో ఇద్దరూ అవసరమైతే అడ్డొచ్చిన వారి ప్రాణాలు తీసైనా అనుకున్నది సాధించే గూఢచారులే. లక్ష్యం కోసం ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని దూసుకుపోయే పాత్రలే. అయితేనేం, ఇద్దరూ ఏ యాక్షన్ సన్నివేశంలో ఎదురయ్యారో తెలియదు కానీ, చటుక్కున వారి మధ్య ప్రేమ పుట్టింది. ప్రేమంటూ పుట్టాక కఠిన హృదయాలు కూడా కరిగిపోయి పాటందుకోవలసిందే కదా? అదే జరిగింది ఆస్ట్రియాలో.
ఈ పాట సినిమాలో చాలా కీలక సన్నివేశంలో వస్తుంది. పరిణతి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ ఎంత గాఢంగా ఉంటుందో ఈ ప్రేమగీతం అంత అద్భుతంగా ఉంటుంది అంటూ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తెలిపారు. ‘సుల్తాన్’తో సల్మాన్ ఖాన్‌కు ఘన విజయాన్ని అందించాడు అలీ అబ్బాస్ జాఫర్. అందుకే ఆయనకు మరో అవకాశమిస్తూ ‘ఏక్ థా టైగర్’ సీక్వెల్ ‘టైగర్ జిందా హై’ని తెరకెక్కించే బాధ్యతను అప్పగించాడు సల్మాన్. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈనెల 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.