టార్గెట్ జనవరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార అంటేనే ఎప్పటికప్పుడు హాట్ హాట్ న్యూస్ అం దించే అందాల భామగా అందరికీ తెలుసు. ఆమె ప్రేమాయాణాలపై వచ్చిన కథనాలే కోకొల్లలు. అలాంటి నయనతార ఎప్పటికప్పుడు తాను అప్‌డేట్ అవుతూ ఎప్పుడూ మీడియాలో తన పేరు హల్‌చల్ చేసేలా చూసుకుంటూనే వుంటుంది. ప్రస్తుతం నయనతార కోలీవుడ్‌లో నెంబర్ వన్ కథానాయికగా వెలుగొందుతోంది. కలెక్టర్‌గా ఆమె నటించిన తమిళ సినిమా ‘అరమ్’ హిట్ అయి ఆమె ఖాతాలో మరో విజయం నమోదైంది. లేడీ ఓరియెంటెడ్ కథ, కథనాలతో హిట్లు కొడుతున్న నయనతార సినిమాలకు పెద్ద హీరోల రేంజ్‌లోనే కలెక్షన్లు వస్తుండడం విశేషం. ఇలా వుంటే రాబోయే నెల జనవరిలో మరి న్ని చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరవ్వడానికి టార్గెట్ పెట్టింది నయనతార. స్టార్ హీరోల చిత్రాలు విడుదలయ్యే నెలగా జనవరిని భావిస్తా రు. స్టార్ హీరోలే కాదు, స్టార్ హీరోయిన్ అయిన నయనతార కూడా ఈ పోటీలో పాల్గొంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు జనవరిలో సంక్రాంతి కానుకగా ఒకటి విడుదల కానుండగా, మరో టి రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ‘ఇమైనా నోడిగళ్’ చిత్రంలో అధర్వ హీరోగా ఆమె చేస్తోన్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి. అన్న ట్టు ఈ చిత్రంలో రేష్మిఖన్నా కూడా మరో నాయికగా నటించింది. ఏదేమైనా స్టార్ హీరోల సరసన తన సినిమాలు కూడా విడుదల చేసే స్థాయికి నయనతార చేరింది.