ప్రేమ ఓ పజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తిక్‌రాజు, నిత్యాశెట్టి, సమీరా ప్రధాన పాత్రల్లో అయాన్ క్రియేషన్స్ బ్యానర్‌పై చునియా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పడేసావే’. ఈ సినిమా ద్వారా హీరోయిన్ నిత్యాశెట్టి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోంది. త్వరలోనే సినిమా విడుదలకానున్న సందర్భంగా హీరోయిన్ నిత్యాశెట్టి చెప్పిన విశేషాలు...
నిహారిక పాత్రలో
ఈ సినిమాలో నిహారిక అనే పాత్రలో నటించాను. ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. ఇప్పటివరకు సినిమాలుగా చాలా ప్రేమకథలు వచ్చాయి. మాది కూడా సింపుల్ లవ్‌స్టోరీ. కాని ప్రేమలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ప్రేమ అనేది జిగ్సా పజిల్ లాంటిది. నా మొదటి సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఒక్కో పాట ఒక్కో జోనర్‌లో వుంటుంది. ఆడియో పెద్ద హిట్ అయ్యింది.
దర్శకురాలు..మంచి ఫ్రెండ్
తను డైరెక్టర్ మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్. ఆమెతో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. వర్క్‌పట్ల డెడికేషన్ వున్న పర్సన్. పర్‌ఫెక్షన్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు.
అందరం ఒకటిగా..
నా కోస్టార్ కార్తిక్‌తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. మంచి ఎంటర్‌టైనింగ్ పర్సన్. సెట్స్‌లో ఎంతో ఫన్ చేసేవాడు. అలానే నాతోపాటు మరో లీడ్ రోల్‌లో నటించిన సమీరా నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్లినా మేమిద్దరమే ఉండేవాళ్ళం. తను కాశ్మీర్ అమ్మాయి. తెలుగు రాకపోయినా చాలా చక్కగా డైలాగ్స్ చెప్పింది.
నాగార్జున అంటే
నాకు చిన్నప్పటినుండి నాగార్జునగారంటే చాలా ఇష్టం. ఆయన ఈ సినిమాకు అసోసియేట్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. మంచి క్యారెక్టర్. మంచి టీమ్ కుదిరింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
రాహుల్ రవీంద్రన్ హీరోగా నటిస్తోన్న ‘శోభన్‌బాబు’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను. ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను.

-యు