బంగ్లాలో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హైదరాబాద్ షోలో’ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎస్.కె.మసి దర్శకత్వంలో ఎస్.కె.ఎమ్. ఫిలింస్ పతాకంపై ఎం.డి.ఖాదర్ ఘోరి, ఎం.డి.అఫ్సర్‌లు నిర్మిస్తున్న ‘బంగ్లాలో అలజడి’ చిత్రం షాద్‌నగర్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ క్లాప్‌నివ్వగా జి.శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దర్శకుడు ఎస్.కె.మసి మాట్లాడుతూ, హారర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రం మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందని, ఇందులో ఐదు పాటలుంటాయని, విజయవాడ, వైజాగ్, గోవాల్లో చిత్రీకరిస్తామని, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న చిత్రమిదన్నారు. నిర్మాత ఖాదర్ ఘోరి మాట్లాడుతూ, సినిమాపై వున్న ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగా నచ్చిందని, ఈమధ్య హర్రర్ సినిమాలు మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. హీరోయిన్ ఫరాఖాన్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు. హీరో అల్త్ఫా మాట్లాడుతూ, ఇప్పటివరకు 20 సినిమాల్లో నటించానని, ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నందుకు ఆనందంగా వుందన్నారు. అలీషా, ఖాదర్ ఘోరి, రహీం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:సన్ని, కెమెరా:సంపత్, నిర్మాతలు:ఖాదర్ ఘోరి, అఫ్సర్, దర్శకత్వం:ఎస్.కె.మసి.