తెలుగులోనే సెటిలవుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు జీబ్రాన్. ఆ తరువాత ‘జిల్’ సినిమాకు కూడా పనిచేశాడు. ప్రస్తుతం పలు అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సంగీత దర్శకుడు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సందర్భంగా జీబ్రాన్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
రొమాంటిక్ సినిమాగా..
‘రన్ రాజా రన్’ లాంటి హిట్ సినిమా, అందులోనూ క్లాసిక్ మ్యూజిక్ తరువాత ఇపుడు చేస్తున్న సినిమా పక్కా మాస్‌గా వుంటుంది. వెంకీ-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో మెలోడి కూడా వుంటుంది. మొత్తం ఐదు పాటలున్నాయి. పాటలన్నీ బాగా వచ్చాయి. ఈ సినిమాకు మ్యూజిక్ బాగుందని వెంకటేష్‌గారు చెప్పినపుడు చాలా ఆనందం వేసింది. మొదటిసారిగా వెంకటేష్‌గారిని కమల్ ఇచ్చిన పార్టీలో కలిశాను. అప్పుడాయన చాలా కూల్‌గా మాట్లాడారు. అపుడే ఆయనతో సినిమా చేస్తున్నాననే భయం పోయింది. సినిమాకు సారంగి నాదస్వరం లాంటి లైవ్ ఇన్‌స్ట్రుమెంట్లను ఉపయోగిస్తున్నాను.
ప్రభాస్ సినిమా..
ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందే సినిమాకు సంగీతం అందిస్తున్నాను. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ ఇమేజ్‌ని తెచ్చుకున్న ప్రభాస్‌తో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. బాహుబలి తురువాత ఆయన చేసే సినిమా కాబట్టి భారీ అంచనాలుంటాయి. దానికి తగ్గట్టుగానే హైస్టాండర్డ్‌లో మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా.
ఇక్కడే సెటిల్ అవుతా
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాను. నా భార్య విజయవాడకు చెందిన అమ్మాయి. కాబట్టి నేను కూడా హైదరాబాద్‌లోనే సెటిలయ్యే ఆలోచనలో వున్నాను.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం నేను సంగీతం అందించిన ‘విశ్వరూపం-2’ సినిమా విడుదలకు రెడీగా వుంది. దాంతోపాటు ‘చెన్నై టు సింగపూర్’ అనే సినిమాకు, అలాగే విక్రమ్ సినిమాకు, మరో మూడు సినిమాలకు సంగీతం అందిస్తున్నాను. తెలుగులో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి.

-యు