15న లవర్ ఆఫ్ ఇడియెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ వద్దిరాల దర్శకత్వంలో రఘుబాబు చౌదరి, కె.పి.చౌదరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియెట్’. ఈ చిత్రం ఈమధ్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- మ్యూజికల్‌గా భారీ హిట్ అందుకున్న ఈ చిత్రం అభిమానుల్లో మంచి అంచనాలు పెంచిందని, అలీ, అభిమన్యుసింగ్, తా.రమేష్, జీవా, సుప్రీత్, గిరి, దేవన్, శ్రవణ్, రోహిణి వంటి భారీ తారాగణంతో లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని తెలిపారు. వరుస హిట్‌లతో ఫామ్‌లో వున్న నివేదా థామస్ నటన, క్రేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని వారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:రతీష్ వేగా, కెమెరా:గిరీష్ గంగాధరన్, ఆథర్ విల్సన్, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, దర్శకత్వం:అజయ్ వద్దిరాల.