అన్నదాత సుఖీభవ షూటింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి రూపొందిస్తున్న చిత్రం ‘అన్నదాత సుఖీభవ’. ఈ సినిమా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ- ‘అన్నదాత సుఖీభవ’ సినిమా రైతు సమస్యలపై తీస్తున్న సినిమా ఇది. ఒకప్పుడు అందరూ అన్నదాత సుఖీభవ అని దీవించేవారు. కానీ నేడు ఆ అన్నదాత బ్రతుకు దుర్భరంగా మారి, దుఃఖీభవగా మారింది. అలాంటి రైతు సమస్యలను తెరపై ఈ అన్నదాత సుఖీభవ సినిమాతో చూపిస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. మా బ్యానర్‌పై రూపొందుతున్న 30వ సినిమా ఇది. దేశానికి తిండిపెడుతున్న రైతు సంక్షోభాన్ని పట్టించుకునేవాడే లేడు. స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళవుతున్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రైతుల ఆత్మహత్యలను ఆపేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. పార్లమెంటులో రైతులపై చర్చ జరగాలి. రైతు పండించే పంటలకు గిట్టుబాటుధరలను ప్రభుత్వమే కల్పించాలనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి. రైతు రుణాలను మాఫీ చేయడంలేదు. దీంతో రైతులు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు సమస్యల పరిష్కారాన్ని మా చిత్రంలో చూపించాం. ఖమ్మం, వరంగల్, ఉభయగోదావరి, ఢిల్లీలలో సినిమాను చిత్రీకరించాం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నాకు ఎవరూ పోటీలేదు, నాకు నేనే పోటీ అని తెలిపారు.