హ్యాట్రిక్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు కెరీర్‌లో ‘పోకిరి’ సినిమా సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమాతో మహేష్-పూరిల కాంబినేషన్‌కు మంచి క్రేజ్ దక్కింది. ఆ తరువాత వచ్చిన ‘బిజినెస్‌మెన్’ కూడా సంచలన విజయం సాధించడంతో మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇప్పటికే పలుమార్లు మహేష్‌తో సినిమా వుంటుందని చెప్పిన పూరి జగన్నాధ్, తాజాగా ఆయనకు కథ చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ‘రోగ్’ చిత్రాన్ని రూపొందిస్తున్న పూరి జగన్నాథ్, ఈ సినిమాల తరువాత నందమూరి హీరోలు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లతో చెరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మురగదాస్ చిత్రం ఉంటుంది. ఈ సినిమాల తరువాత మహేష్-పూరిల చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశాలున్నాయి.