మనసుకు నచ్చేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుత పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లల్ని వదిలి డబ్బుకోసం పరిగెడుతున్నారు. పిల్లలను పట్టించుకొనే తీరిక వాళ్లకు లేదు. అలాంటి ఓ పాయింట్ తీసుకుని మనసుకు హత్తుకునేలా ‘కుటుంబకథా చిత్రమ్’ సినిమాను రూపొందించారు అని హీరో కమల్ కామరాజు తెలిపారు. తాజాగా ఆయన నటించిన కుటుంబ కథా చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం గూర్చి పలు విశేషాలు వివరించారు. మొదట ఈ చిత్ర దర్శకుడిని చూసినపుడు ఎలా చేస్తాడా అనిపించింది. కానీ బాగా చేశాడు. సినిమా అంతా గండిపేట దగ్గర వేసిన ఓ హౌస్ సెట్‌లో జరిగింది. సాయంత్రం వెళ్లి రాత్రి 2 గంటల వరకు అక్కడే షూటింగ్ చేసేవాళ్లం. ప్రతి సన్నివేశం సింగిల్ టేక్‌లోనే చేయాలని దర్శకుడు ప్రయత్నించాడు. నందు, శ్రీముఖిలమధ్య వచ్చే సన్నివేశాలు ఒకే ఫ్లోలో వుంటాయి. వారిద్దరిమధ్య వచ్చే సన్నివేశాలు చూస్తే నిజంగా మన ఇళ్ళల్లో జరిగినట్లుగానే వుంటాయి. అర్జున్‌రెడ్డి చిత్రంలో మొదట నటించాలన్న ఆఫర్ వచ్చినమాట నిజమే. అయినా అలాంటి కథలు నేను చేయనని చెప్పిన మాట నిజమే. కానీ సందీప్ పట్టుపట్టి అవకాశం ఇచ్చాడు. కాటమరాయుడు, అర్జున్‌రెడ్డి సినిమాలు విడుదలయ్యాక ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం విజయవాడ బేస్డ్ ప్రేమకథలో నటిస్తున్నా. విజయవాడలో నేను పాల్గొన్న షూటింగ్ ఇదే. తరువాత ఓ వైవిధ్యమైన ప్రాజెక్టులో నటించనున్నాను. అది అరబ్ బేస్డ్ స్టోరీ. నిర్భయ్ కేసు జరిగినపుడు చెప్పులు లేకుండా తిరిగా. అపుడు చాలా అసహనం అనిపించింది నాకు. అలాంటివారి కోపంతో విసుగుతో ఆరు నెలలు అలా తిరిగాను. అలా ఏదైనా విన్నపుడు కదిలిపోతుంటాను అని తెలిపారు.