‘ఆటగాళ్లు’ మొదలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగపతిబాబు, నారారోహిత్ కథానాయకులుగా ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ పతాకంపై పరుచూరి మురళి దర్శకత్వంలో వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆటగాళ్లు’. ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిర్మాతలు మాట్లాడుతూ- టిపికల్ సబ్జెక్టుతో వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తుందని తెలిపారు. లవ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వుండే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలన్నీ త్వరలో తెలియజేస్తామని వారు అన్నారు. బ్రహ్మానందం మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:గోపి, కెమెరా: విజయ్ సి.కుమార్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.