ఒక్కోసారంతే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథలు ఎంపిక చేసుకోవడమే కథానాయికలకు ప్రధానమైన బలం. ఒక్కొక్కసారి కథ విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అయితే సినిమా రూపంలోకి వచ్చాక తేలిపోయినట్లు అనిపిస్తుంది. అంటే.. కథకుడు బాగా చెప్పినా దర్శకుడు ఆ చిత్రాన్ని సరైన రీతిలో రూపొందించలేదనే కదా అర్థం! అలా నా కెరీర్‌లో కూడా జరిగాయి. కథ విన్నప్పుడు బాగా నచ్చి సినిమా ఒప్పుకుంటా. కొన్ని విడుదలయ్యాక చూస్తే అసలు ఈ కథను ఎందుకు ఒప్పుకున్నానా? అని నాకే అనుమానం వస్తుంది. అలా రెండు మూడు చిత్రాలకి ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నా. కొన్ని మాత్రం మనం ఏది అనుకుంటామో స్క్రీన్‌మీద అదే కనిపించి పూర్తి సంతృప్తి ఇస్తుంది. అందుకే కథల ఎంపికల విషయంలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనిపించింది. కథ నచ్చినా అది తెరపైకి వచ్చేసరికి అదేవిధంగా ఉంటుందన్న నమ్మకం లేదు. అంతే.. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటుంది అంటూ తన మనసులో భావాన్ని చెప్పుకొచ్చింది హెబ్బాపటేల్. నిజమే మరి.. కథల ఎంపిక విషయంలో హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని మరోసారి హెబ్బా విషయంలో రుజువవుతోంది.