బేవాచ్‌లో ప్రియాంకచోప్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రాకు హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం లభించింది. ఇప్పటికే అమెరికా టివి షో ‘క్వాంటికో’లో నటించి ఆదరణ పొందిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనుంది. అయితే హీరోయిన్‌గా కాదు. ఆమె ప్రతినాయిక పాత్రలో కన్పిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చేవారం ప్రారంభమవుతుంది. లాస్‌ఎంజిలిస్, కాలిఫోర్నియా తీరంలో గస్తీదళ సిబ్బంది, వారి పనితీరుపై వచ్చిన టీవీ ధారావాహిక ‘బేవాచ్’ ప్రపంచంలో ఎక్కుమంది చూసిన సీరియల్‌గా రికార్డులు నమోదుచేసిన విషయం తెలిసిందే. 1980-90 దశకంలో ‘బేవాచ్’ పేరిట వచ్చిన టీవీ షోలో పమేలా అండర్సన్, డేవిడ్ హసిల్‌హాఫ్ ప్రధానపాత్రల్లో నటించారు. కాగా ఆ సీరియల్ ఆధారంగా అదే పేరుతో ఇప్పుడు సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె ప్రతికథానాయికగా నటిస్తోంది. 2017లో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని హాలీవుడ్ నటులు జాన్సన్, ది రాక్ ధ్రువీకరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. తను ఆ సినిమాలో నటిస్తున్న విషయం నిజమేనని ప్రియాంకకూడా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్‌కు బాలీవుడ్ నటీనటులు సన్నీలియోన్, మధుర్‌భండార్కర్ తదితరులు హర్షం వ్యక్తం చేస్తూ రీట్వీట్ చేశారు.