పాటల్లో నేటి విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి ఎస్.సరిత సమర్పణలో హేరి ఫెర్నాండెజ్ దర్శకత్వంలో భోజ్‌పురిలో విడుదలై ఘనవిజయం సాధించిన ఆజ్ కె కరణ్ అర్జున్ చిత్రాన్ని ఆర్.కె. నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం నేటి విజేతలు. ఈ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, భోజ్‌పురిలో సూపర్‌హిట్ అయిన చిత్రాన్ని తెలుగులోకి అందిస్తున్నారని, పాటలు బాగున్నాయి. చిన్న చిత్రాలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో చాంబర్‌లో కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ తరఫున ఈ సినిమాకు థియేటర్ల విషయంలో సహాయం చేస్తానని, తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు. డి.ఎస్.రావు మాట్లాడుతూ, పాటలు చాలా బాగున్నాయని, నిర్మాత ఈ సినిమా విజయంతో మరిన్ని మంచి సినిమాలు తీయాలని అన్నారు. నిర్మాత సుధాకర్ మాట్లాడుతూ, తొమ్మిది పాటలతో అందరినీ అలరించేలా రూపొందించిన చిత్రమిదని, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా వుంటాయని, యాక్షన్ కామెడీ, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందన్నారు. భోజ్‌పురిలో సూపర్‌స్టార్స్‌గా వెలుగొందుతున్న దినేష్‌లాల్, ప్రవేశ్‌లాల్‌లు హీరోగాలు నటిస్తున్నారు. హీరోయిన్లుగా పాకీ హెగ్డే, క్రిషాకండెల్కర్ నటించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.