ప్రభాస్ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ క్రేజ్ మరింత పెరుగుతోంది. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్‌తో పాటుగా కోలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. సుజిత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం తరువాత కృష్ణంరాజు దర్శకత్వంలో ఓ చిత్రంలో కూడా ప్రభాస్ నటించనున్నాడట. ‘ఒక్క అడుగు’ పేరుతో ఓ సినిమా చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలు ప్రభాస్‌కోసం ఎదురుచూస్తుండగా కృష్ణంరాజు ఈ ఏడాది చివరలో తన సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ చిత్రానికి ‘దందా’ అన్న పేరును పెడతారట. గోపీకృష్ణ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కూడా నటిస్తారట. ఇద్దరూ కలిసి నటించిన ‘బిల్లా’ సినిమా గుర్తుంది కదా! మరోసారి ఇదే కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాల్సిందే!