రామ్‌తో రష్మిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో నటుడు రామ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమా తరువాత ఆయన నటిస్తున్న చిత్రం ఇదే. ‘నేను లోకల్’ సినిమా తరువాత నక్కిన త్రినాథరావు చేస్తున్న సినిమా కూడా ఇదే. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటించనున్నదట. ప్రస్తుతం ఆమె నిఖిల్‌తో ‘కిరాక్ పార్టీ’ చిత్రంతోపాటుగా విజయ్ దేవరకొండ, పరశురామ్‌ల చిత్రంలో నటిస్తోంది. ఒక్క సినిమా విడుదల కాకుండానే ఈ అమ్మడు మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా వుంది. రామ్‌తో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభం కానున్నదట.