18నుండి రెగ్యులర్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై సూర్య, సాయి పల్లవి జంటగా ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సందర్భంగా కథానాయకుడు సూర్య మాట్లాడుతూ- తాను ఇప్పటివరకు చేస్తున్న 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని, దర్శకుడు చెప్పిన కథ వైవిధ్యంగా సాగుతుందని, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా దర్శకుడు రూపొందిస్తున్నారని తెలిపారు. సూర్య లాంటి వెర్సటైల్ హీరోతో ఇలాంటి చిత్రం చేయడం సంతోషంగా వుందని, సూర్య మాత్రమే ఈ పాత్రకు యాప్ట్‌గా వుంటారని దర్శకుడు సెల్వరాఘవన్ అన్నారు. ఓ మంచి చిత్రంగా ఈ సినిమాను తమ సంస్థలో రూపొందిస్తున్నామని సూర్య, సెల్వరాఘవన్‌ల కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని, ఈనెల 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: సెల్వరాఘవన్.