వైఎస్‌గా మమ్ముట్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్ హవా ఎక్కువ అవుతోంది. కొత్త కథలను వెతికే కంటే కొం దరు గొప్ప వ్యక్తుల జీవిత కథలను తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఈ పద్ధతి ఇప్పుడు టాలీవుడ్‌కు వచ్చింది. తెలుగులో బయోపిక్ చిత్రాలు ఎక్కువగానే తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్, మహానటి సావిత్రి, పుల్లెల గోపీచంద్ కథలు సినిమాలుగా వస్తున్నాయి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత కథను సినిమాగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణ స్థాయి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన వై.ఎస్ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకంగా వుంటుందని దర్శకుడు మహిత్ రాఘవ ఈ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆయనతో చర్చలు కూడా జరుగుతున్నాయట. మరోవైపు ఈ చిత్రం కోసం అనుమతి తీసుకోవడానికి వై.ఎస్ తనయుడు జగన్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు. అన్నీ కుదిరాయంటే త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది.