శివాని ఎంట్రీ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రాజశేఖర్ కూతురు శివానిని హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఎంట్రీ ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే, వినాయక్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన వెంకట్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే 2 స్టేట్స్ అనే బాలీవుడ్ చిత్రానికి రీమేక్ రూపొందిస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శివాని హీరోయిన్‌గా నటించనుంది. 2 స్టేట్స్ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తారట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని, త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఈమధ్య హీరోల కూతుళ్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మరి శివాని ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటుందో చూడాలి!