ఆ కల ‘జై సింహా’తో తీరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి, హరిప్రియ, ముఖ్యపాత్రల్లో కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ‘జై సింహా’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అభిమానుల సమక్షంలో వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీరంగ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు వినాయక్ యూనిట్ సభ్యులకు షీల్డులు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ- ఈ చిత్రంలో బాలయ్య బాబు డాన్సుల్లో అదరగొట్టాడు. సెట్‌లో ఎంతో ప్రేమగా ఉంటాడాయన. ‘నరసింహనాయుడు’ తరువాత ఒక బిడ్డ సెంటిమెంట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. అద్భుతంగా వచ్చింది. కళ్యాణ్ అన్నయ్య ఎంతోగానే ప్రేమించి చిత్రాన్ని నిర్మించారు. నాకిష్టమైన దర్శకుల్లో కె.ఎస్.రవికుమార్ ఒకరు. తప్పకుండా సినిమా ఘనవిజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ- నిర్మాత కల్యాణ్‌కు బాలకృష్ణ నాకు మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అన్ని రకాల టెక్నికల్ హైలెట్స్‌తో కూడిన సినిమా ఇది. సినిమాకు ముందు బాలకృష్ణకు చాలా కోపం అని చెప్పారు. కానీ షూటింగ్ చేసేటప్పుడు ఒక్క రోజు కూడా కోపాన్ని చూడలేదు. ఇప్పటికి 47 సినిమాలు చేశాను. కథ విన్న తరువాత హీరోలు సినిమాల విషయంలో ఇన్‌వాల్వ్ అవుతారు. కానీ ఇద్దరు మాత్రమే ఇన్‌వాల్వ్ కారు. వారే అజిత్, బాలకృష్ణ. కథను అంతగా నమ్మిన వ్యక్తి ఆయన. తప్పకుండా ఆయన నట విశ్వరూపాన్ని చూస్తారు అన్నారు. నిర్మాత కల్యాణ్ మాట్లాడుతూ- బాలయ్య డాన్సులు నటనతో అలరించాడు. సంక్రాంతికి ఆయన సినిమాలు ఘనవిజయం సాధించడం పరిపాటి. అదే కోవలో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ- నవరసాలు వున్న సినిమా ఇది. రవికుమార్‌తో సినిమా చేద్దామని ఎనిమిదేళ్లుగా అనుకుంటున్నాం. ఆ కల ‘జై సింహా’తో తీరింది. ఈ టైటిల్‌తో సినిమా చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది సాధారణ టైటిల్ కాదు. నాన్నగారు నిర్మాతగా మూడో సినిమా ఇదే టైటిల్‌తో తీసి ఘనవిజయాన్ని అందుకున్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలో రాని ట్విస్టు ఈ సినిమాలో వుంటుంది అన్నారు.