జయ ‘లక్కీఫెలో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో మహిళా దర్శకురాలిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బి.జయ తన తదుపరి సినిమాకు సిద్ధమవుతోంది. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించి రచయిత్రిగా, ‘సూపర్‌హిట్’ పత్రిక జనరల్ మేనేజర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జయ సినిమాల మీద మక్కువతో ‘చంటిగాడు’ చిత్రంతో దర్శకురాలిగా మారి ‘గుండ మ్మ గారి మనవడు’, ‘లవ్‌లీ’, ‘వైశాఖం’ లాంటి ఫీల్‌గుడ్ చిత్రాలను ప్రేక్షకులకు అందించి సిల్వర్ క్రౌన్ అవార్డును అందుకున్నారు. నేడు బి. జయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- వైశాఖం తరువాత ఆర్.జె సినిమాస్ బ్యానర్‌పై తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టనున్నాం. జూన్ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక యంగ్ క్రేజీ హీరో ఇందులో నటిం చనున్నాడు. ఆ హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఈ చిత్రానికి ‘లక్కీఫెలో’ అనే టైటిల్ ఖరారు చేశాం. జనరల్‌గా మనలో ఒకడికి ఏదైనా ఛాన్స్ వస్తే.. వాడిని లక్కీఫెలో అంటాం... అలాంటి హీరో లక్కీఫెలో అవడంపట్ల దాన్ని ఎలా రిసీవ్ తీసుకున్నాడు? అన్నది కథ.. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. అలాగే హీరోతో పాటు హీరోయిన్‌ది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ వుంటుంది. మన సమాజంలో ఆడవాళ్లకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అవి మానసికంగా చాలా అల్లకల్లోలం చేస్తుంటాయి. ఆ పాయింట్ ఇంతవరకూ ఎవరూ టచ్ చేయలేదు. జనరల్‌గా టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే అమ్మాయిలు బస్సుల్లో ప్రయాణించేటప్పుడు మగవాళ్లు కావాలని కొంతమంది, అనుకోకుండా అమ్మాయిల్ని టచ్ చేస్తారు. ఆ టైమ్‌లో అమ్మాయిలు చాలా ఎంతో ఇబ్బందికి గురవుతారు. ఆ టచ్ వాళ్లని చాలా కాలం వెంటాడుతుంది. ఇలాంటి కొన్ని సెన్సిటివ్ అంశాలని హీరోయిన్ డీల్ చేస్తుంది. పాటలకి, రొమాన్స్‌కే కాకుండా, హీరోయిన్ క్యారెక్టర్‌కి ఓ ప్రాముఖ్యత ఉండాలని ట్రై చేస్తున్నాం. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ వుంటూనే అండర్ కరెంట్‌లో కొంత సందేశం కూడా వుంటుంది. నా తొలిచిత్రం ‘చంటిగాడు’ నుంచి ‘వైశాఖం’ వరకు వినోదం మిస్ కాలేదు. ‘లక్కీఫెలో’ చిత్రానికి సంబంధించి మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దర్శకురాలిగా మంచి కథలతో సినిమాలు తీయాలన్న ఆసక్తితో మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తున్నాను. ఇటీవల తీసిన ‘వైశాఖం’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేశారు. చాలా మంది సినిమా బావుంది.. మంచి సినిమా తీశారు అని ప్రశంసించారు. చిత్రసీమలో మహిళా దర్శకుల సంఖ్య పెరగాల్సిన అవసరం వుంది. ఆ దిశగా మార్పు రావాలి అన్నారు. తాజాగా తీయబోయే ‘లక్కీఫెలో’ సినిమా కూడా మా ఆర్.జె. బ్యానర్‌పై బి.ఎ.రాజు నిర్మాణంలో ఉంటుంది అని తెలిపారు.