విజయ్ హర్రర్ చిత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించారు. కొన్ని వర్గాలనుండి ఈ చిత్రం విమర్శలు ఎదుర్కొన్నా చివరకు మంచి కలెక్షన్స్‌తో పెద్ద విజయానే్న అందుకుంది. ప్రస్తుతం అరడజను సినిమాలు ఆయన చేతిలో వున్నాయి. వీటిలో మూడు చిత్రాలు సెట్స్‌పై వుండగా, మిగిలిన మూడు త్వరలో ప్రారంభం కానున్నాయి. అయితే వీటిలో ముందుగా ఏది విడుదలవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే
ఇదివరకు ‘ది ఎండ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రాహుల్‌తో తన తదుపరి చిత్రం అంటున్నారు. రాహుల్ ది ఎండ్ చిత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే అతని టేకింగ్‌ని మెచ్చిన విజయ్ ఆయనకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఒక అద్భుతమైన థ్రిల్లర్ అని, ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని నిర్మాతలు అంటున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం వుంది.