ఇది నా లవ్‌స్టోరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై తరుణ్, ఓవియా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఎస్.వి.ప్రకాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దర్శకులు రమేష్ గోపి. హీరో తరుణ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో హీరో తరుణ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్.వి.ప్రకాష్ మాట్లాడుతూ- హీరో తరుణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా కోసం వర్క్ చేసిన నటీనటులు సాంకేతిక నిపుణుల కారణంగా సినిమా చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 14న సినిమాను విడుదల చేస్తున్నాం అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీనాథ్ విజయ్ మాట్లాడుతూ- తెలుగులో నా తొలి చిత్రమిది. మంచి సంగీతం, రీరికార్డింగ్ కుదిరింది. డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ- తరుణ్ పుట్టినోజు సందర్భంగా ఆయన చేతులమీదుగా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా వుంది. మనసున్న మనుషులందరికీ ఫిబ్రవరి 14న విడుదలయ్యే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరీ. సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. లవర్స్‌కు మంచి ట్రీట్ అవుతుందని గర్వంగా చెప్పగలను అన్నారు. నాగార్జున విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాను చూసే ప్రేక్షకుడు ఇది నా లవ్‌స్టోరీ అని తప్పకుండా ఫీల్ అవుతాడు అన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ- నా పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది. టీజర్ పెద్ద హిట్ అయ్యింది. నాగార్జున టీజర్ విడుదల చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. రెగ్యులర్ ప్రేమకథ కాదు. ఇందులో మూడు గెటప్స్‌లో నేను కన్పడతాను. ఇందులో ట్రిపుల్ రోల్ చేశానా లేదా మూడు షేడ్స్ వున్న పాత్ర చేశానా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి, మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చక్కగా కుదిరాయి. హీరోయిన్ ఓవియా చాలా చక్కగా నటించింది. ఈ చిత్రానికి ఎడిటర్:శంకర్, కెమెరా: క్రిస్ట్ఫర్ జోసెఫ్, మ్యూజిక్: శ్రీనాథ్ విజయ్, నిర్మాత: ఎస్.వి.ప్రకాష్, దర్శకత్వం: రమేష్, గోపి.