జోరు పెంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్కీ భామ తమన్నాకు ఈమధ్య కెరీర్ సాఫీగా సాగడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి మూడు భాషల్లో తెరకెక్కి భారీ పరాజయాన్ని చవిచూసింది. దాంతో తమన్నా ఆశలు నీరుగారిపోయాయి. అంతేకాకుండా అవకాశాలు కూడా తగ్గాయి. దానికితోడు వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘క్వీన్’ చిత్రంలో మాత్రమే నటిస్తోంది. అటు కోలీవుడ్‌లో కూడా పరిస్థితి అలాగే మారింది. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ సరసన ‘నా నువ్వే’చిత్రంలో నటిస్తున్న ఈమెకు మళ్లీ అవకాశాలు జోరందుకున్నాయి. మళ్లీ తన క్రేజ్ పెంచుకునేందుకు తెగ కసరత్తులు చేస్తున్న తమన్నాకు ఇప్పుడు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే సందీప్‌కిషన్ సినిమాతోపాటు మరో క్రేజీ చిత్రంలో అవకాశం పట్టేసింది. దాంతోపాటు తమిళంలో కూడా ఓ క్రేజీ ప్రాజెక్టు చేస్తోంది. మొత్తానికి మళ్లీ తన హవాను నిలుపుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తోంది.