భాగ్యనగరంలో ‘సాహో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ ముందుగా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం దుబాయ్‌లోను బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరణ జరపాలని సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. కానీ అనుమతులకు ఆలస్యం అవుతున్న కారణంగా ఆ షెడ్యూల్‌ను పక్కనబెట్టి హైదరాబాద్ షెడ్యూల్‌కు సిద్ధమయ్యారు టీమ్. ఈ షెడ్యూల్ రేపటినుండి మొదలుకానుంది. ప్రభాస్‌తోపాటు ముఖ్య తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ త్రయం శంకర్, ఈషాన్, లోయ్‌లు సంగీతాన్ని అందిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు.