ట్రైలర్‌లో ఎనె్నన్ని వింతలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, సౌమ్యా వేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరిహర చలనచిత్ర బ్యానర్‌పై ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, ఇప్పిలి రాంమోహన్‌రావు నిర్మిస్తున్న చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. పూజా రామచంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘నా శిష్యుడు వరప్రసాద్ దర్శకుడిగా మారి ఈ సినిమా చేస్తుండడం ఆనందంగా వుంది. టైటిల్ బాగుంది. ట్రైలర్ చూశాను. ఆసక్తికరంగా వుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘వినాయక్ ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా వుంది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:చోటా కె ప్రసాద్, కెమెరా:మురళీమోహన్‌రెడ్డి, సహ నిర్మాత:డి.శ్రీనివాస్ ఓంకార్, నిర్మాతలు:శ్రీకాంత్‌రెడ్డి, రాంమోహన్‌రావు, దర్శకత్వం:వరప్రసాద్ వరికూటి.