ఈ నగరానికేమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిచూపులు సినిమాతో సంచలన దర్శకుడిగా మారిన తరుణ్ భాస్కర్‌కు ఆ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. పెళ్లిచూపులు విడుదలై చాలారోజులు అవుతున్నప్పటికీ ఏ చిత్రాన్నీ మొదలుపెట్టలేదు. తాజాగా ఆయన మరో చిత్రంతో రానున్నాడు. విష్వక్సేన (వెళ్లిపోమాకే ఫేం) అనీషా ఆంబ్రోస్ జంటగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమా ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్‌గా వుంటుందట. ఈ చిత్రానికి ‘ఈ నగరానికేమైంది?’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పెళ్లిచూపులు తరువాత తరుణ్ భాస్కర్‌కు స్టార్ హీరోల సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నా కూడా ఆయన మళ్లీ కొత్తవాళ్లతో సినిమా చేయడం ఆసక్తిరేపుతోంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.