సవ్యసాచి జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగచైతన్య చేస్తున్న ‘సవ్యసాచి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చైతన్యతో కలిసి ప్రేమమ్ వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇటీవలే చిత్ర యూనిట్ ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఆ తరువాత కొద్దిగా గ్యాప్ తీసుకుని ఇటీవలే ఇంకో షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇందులో హీరోతోపాటు మరికొందరు ముఖ్య నటీనటులు పాలు పంచుకుంటున్నారు. బాలీవుడ్ నటి నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.