సంచలన పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లా మర్ హీరోయిన్‌గా దాదాపు దశాబ్దకాలంపైగా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయకు ఈమధ్య క్రేజ్ తగ్గింది. దాంతో అవకాశాలు తగ్గాయి. మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మోహన్‌బాబు నటిస్తున్న గాయత్రి చిత్రంలో విభిన్న పాత్రలో కన్పించనున్న శ్రీయ, తాజాగా మరో అసాధారణ పాత్రలో నటించేందుకు సిద్ధమైందట. శ్రీయ కెరీర్‌లో నిజంగా ఇలాంటి పాత్ర చేయలేదని అంటున్నాయి సినీ వర్గాలు. ఆ వివరాల్లోకి వెళితే.. నూతన దర్శకురాలు సృజన దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో శ్రీయ కీలక పాత్రలో కన్పించనున్నదట. ఈ చిత్రానికి మాయిస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించనుండగా, సాయిమాధవ్ బుర్రా డైలాగులు అందిస్తున్నాడు. పలువురు టాప్ టెక్నీషియన్లతో తెరకెక్కనున్న ఈ చిత్రం మార్చిలో మొదలుకానున్నదట. మొత్తానికి ఈ సినిమాతో శ్రీయ సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నాయి సినీ వర్గాలు.