జువ్వ పోస్టర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్, పలక్ లల్వాని జంటగా ‘దిక్కులు చూడకు రామయ్య’ ఫేం త్రికోటి పేట దర్శకత్వంలో సొమ్మి ఫిలింస్ బ్యానర్‌పై డా.్భరత్ సోమి నిర్మిస్తున్న చిత్రం ‘జువ్వ’. ఈ చిత్ర టీజర్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- సంక్రాంతి సందర్భంగా జువ్వ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా హీరో, నిర్మాతలు అన్నదమ్ములు. వారి తండ్రితో నాకు మంచి పరిచయం వుంది. తమ్మునికోసం భరత్ డాక్టర్‌గా వుండి నిర్మాత అయ్యాడు. అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా వస్తున్న ఈ సినిమా టీజర్‌లో రంజిత్ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. పక్కా మాస్ పాత్రలో అదరగొట్టాడు. రాజవౌళి శిష్యుడు త్రికోటి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. హీరో రంజిత్ మాట్లాడుతూ- చిరంజీవిగారంటే నాకెంతో ఇష్టం. ఆయనే నాకు రోల్‌మోడల్. ఆయనతో ఒక్క ఫొటో దిగితే చాలానుకునేవాడిని. కానీ నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా టీజర్‌ను ఆయన విడుదల చేయడం ఆనందంగా వుంది అన్నారు. దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ- చిరంజీవి ఈ చిత్ర టీజర్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా వుంది. ప్రేమకతోపాటు తెరకెక్కిన ఈ చిత్రంలో చిన్న చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నారు. నిర్మాత భరత్ మాట్లాడుతూ- ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈనెలాఖరున పాటలను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:సురేష్, నిర్మాత:్భరత్ సోమి, దర్శకత్వం:త్రికోటి పేట.