17న కాకతీయ కళావైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళలను కళాకారులను ప్రోత్సహిస్తూ వారిని గౌరవించే మంచి మనిషి కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి టిఎస్‌ఆర్ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే విధంగా కాకతీయ కళావైభవ మహోత్సవాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సుబ్బిరామిరెడ్డి మ మాట్లాడుతూ- కాకతీయుల పరిపాలన స్వర్ణయుగం లాంటిది. 600 ఏళ్ళ క్రితమే తెలుగు సంస్కృతి, నాగరితలను ఘనంగా చాటారు. కళల్ని పోషించారు. ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలను శిల్పకళానైపుణ్యం, చాతుర్యంతో నిర్మించారు. కృష్ణదేవరాయలకంటే ముందునుంచే తెలుగు జాతికి వారసత్వాన్ని అందించారు. వరంగల్ రాజధానిగా 300 ఏళ్ళు తెలుగువాళ్ళని పాలించిన వారి పేరుమీద కాకతీయ కళావైభవాన్ని నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈనెల 17న శిల్పకళావేదికలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు చేతులమీదుగా వేడుక ప్రారంభం అవుతుంది. ఈ వేడుకలో ప్రముఖ నటుడు మోహన్‌బాబును విశ్వనట సార్వభౌమ బిరుదుతో సత్కరిస్తున్నాం. పలువురు ఆధ్యాత్మిక రాజకీయ సినీ రంగ ప్రముఖులు పాల్గొంటారు. దాంతో తెలంగాణాలోని వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామామాద్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో రెండు మూడు నెలలకోసారి కాకతీయ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ- కళలన్నా, కళాకారులన్నా సుబ్బిరామిరెడ్డికి ఎంతో ఇష్టం. ఆయన కాకతీయుల కళావైభవాన్ని ప్రజలకు చాటి చెప్పాలనుకోవడం అభినందనీయం. ఈ వేదికపై విశ్వ నట సార్వభౌమ బిరుదును ఇస్తామని చెప్పారు. బిరుదులు నాకెందుకు అన్నాను. కానీ ఆయన పట్టుపట్టడంతో ఆయన నిర్ణయాన్ని కాదనలేకపోయా అన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, విజయ్‌కుమార్, కూచిపూడి కళాకారిణులు పద్మజ, సుజాత పాల్గొన్నారు.