అనగనగా ఓ రాజకుమారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్‌బాబు, సంజన, అమృత హీరోహీరోయిన్లుగా శ్రీమతి రమాదేవి సమర్పణ లో రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ బేనర్‌పై షాలినీ ఫేమ్ షేరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. పి.వి.రాఘవులు నిర్మాత. కమెడియన్ సుమన్‌శెట్టి ప్రధానపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూలును గోవాలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలిపారు- లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా సాగే చిత్రమిది. ఇటీవలే మొదటి షెడ్యూల్‌ని గోవా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో చిత్రీకరించాం. సరికొత్త పాయింట్‌తో రూపొందించే ఈ సినిమా గోవా నేపథ్యంగా సాగుతుంది. కామెడీతోపాటు థ్రిల్లర్ అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలో రెండవ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో మొదలుపెట్టనున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా మరియు ఎడిటింగ్-ఏకరి లక్కి, కథ-100 డేస్ మూవీస్, పాటలు-బాషాశ్రీ, సమర్పణ-రమాదేవి, నిర్మాత-పి.వి.రాఘవులు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం-షేరాజ్.