మళ్లీ శర్వాకు జోడీగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వున్న హీరోయిన్‌లలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. గ్లామర్ పాత్రలకు ఆమడ దూరంలో వున్న ఈ భామ, నటిగా తనదైన సత్తా చాటుకునే పాత్రల్లో మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈమధ్యే అల్లు అర్జున్ సరసన ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించిన నిత్య, మరోసారి శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమైంది. ఇదివరకే శర్వానంద్‌తో మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు చిత్రంలో నటించి మెప్పించిన నిత్య, మరోసారి శర్వాతో కలిసి సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో నటించనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా వుంటుందట. ఆ పాత్ర కోసం కాజల్‌ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక నిత్యామీనన్ పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చేదిగా వుంటుందట.