నచ్చిన పాత్ర కోసం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా హీరోలు, హీరోయిన్లంటే లక్షల్లో సంపాదన, లక్షల్లో అభిమానులు ఉంటారు. మరి ఇంతమంది అభిమానులు ఉండాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. అందం, అభినయం వుండగానే సరిపోదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే తత్త్వం వుండాలి. ఒకప్పుడు సినిమాల్లోకి రావాలంటే నాటికలు, డ్రామాలు, స్టేజీ షోల్లో మంచి కార్యక్రమాలు చేసివుండాలి. ఇప్పుడు అలాంటి క్లిష్టపరిస్థితి ఏం లేదు. నాలుగైదు దశాబ్దాల క్రితం సినిమాల్లోకి రావాలంటే రోజులు, నెలల తరబడి మద్రాసులోని స్టూడియోల చుట్టూ తిరగాల్సి వుండేది. ఎంత తిరిగినా కూడా అనుభవం లేకుంటే అవకాశాలు రాకపోయేవి. ఒకప్పుడు నాటకాల ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన నటులకు చిత్రసీమలో మంచి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వచ్చేవి. ఆరోజుల్లో సినిమాల్లో పోటీ తక్కువగా వుండేది. ఒకటి, రెండు సినిమాలకు పనిచేసినా కూడా బాడీ లాంగ్వేజీ కోసం, డైలాగ్ డెలివరీ కోసం ఇంకా ప్రాక్టీస్ చేసేవాళ్లు. డైలాగ్ చెప్పడం కోసం మాట సన్నగా వస్తుంటే కనుక సిగరెట్లు తాగమని చెప్పటం అప్పట్లో పరిపాటి. బాడీ లాంగ్వేజీ సరిగా ఉండటానికి వ్యాయామం, ఎక్సర్‌సైజ్‌లు చేయటం, ఒక మెనూ ప్రకారం తినడం లాంటివి చేసేవారు. ఒక్కో దశలో ఇవన్నీ చేయాల్సి వచ్చినపుడు కొంత ఇబ్బందికరంగా కూడా వుండేది.
నాలుగైదు దశాబ్దాల క్రితం సినీ పరిశ్రమలో పౌరాణిక చిత్రాలలో హెయిర్‌స్టయిల్‌కు గొప్ప ప్రాముఖ్యముండేది. ఎలాంటి పాత్ర పోషించినా తలమీద కిలోల బరువున్న వెంట్రుకలు. అదే ఇప్పుడైతే సినిమాల కోసం నెలల తరబడి హెయిర్, గెడ్డాలు, మీసాలు పెంచుకోవాల్సిందే. బాడీని కూడా అమాంతం రెండింతలు పెరిగేలా నటించాల్సిన సినిమాలు వస్తున్నాయి. ప్రభాస్ అయితే బాహుబలి రెండు భాగాల కోసం దాదాపు 150 కేజీలు పెరగాల్సి వచ్చింది. అసలే శరీరం బరువు, దానికితోడు తల వెంట్రుకలు, గెడ్డం, మీసాలు కూడా సహజత్వం కోసం దాదాపు రెండేళ్లు పెంచుకోవాల్సి వచ్చింది. బరువు పెరగడమంటే ఇష్టమొచ్చినట్లు పెరగడం కాకుండా, ఒక పద్ధతి ప్రకారం రోజులో ఎక్కువ సమయం వ్యాయామానికి కేటాయించాల్సి వుంటుంది. తిండి కూడా లిమిట్‌గా ఒక మెనూ ప్రకారం తినాల్సి వుంటుంది. ఎందుకంటే ఆ పాత్రలో ఇమిడిపోవాలంటే బాడీ లాంగ్వేజీ కూడా అలాగే వుండాలి. కానీ ఎంత రిస్క్‌గా వుంటుందో ఊహకే అందదు. అలాంటివి అనుభవించేవారికి ఎలా వుండాలి. కానీ నచ్చిన పాత్ర కోసం చేయడం వారికిష్టం.
ఇక మెగాస్టార్ చిరంజీవికి కూడా ఇలాంటి నియమాలు తప్పడం లేదు. ఇవన్నీ అభిమానుల కోసమే. అనుష్క జీరో సైజ్ కోసం ఆరు నెలలో 28 కేజీలు పెరిగి మళ్లీ ఐదు నెలల్లో యథాస్థితికి వచ్చింది. దంగల్ సినిమా కోసం అమీర్‌ఖాన్ పొట్ట కూడా పెంచాల్సి వుండడంతో బాడీతోపాటు పొట్టను కూడా పెంచాడు. అమీర్‌ఖాన్ నేచురాలిటీ కోసం దంగల్ సినిమాలో పొట్టతో కనిపించాడు. మరి ఆ సినిమా పూర్తయ్యాక స్లిమ్‌గా తయారవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే హీరోహీరోయిన్లు కాస్త పీలగా వుంటే కొన్ని పాత్రలకు సరిపోరు. కాబట్టి కొన్ని నెలలు జిమ్‌లో కసరత్తు చేయాల్సి వుంటుంది. ఇంతకుముందు సినిమాల్లోనైతే ముఖాభినయం, నటన బాగుంటే ఒకట్రెండు టేకుల్లో సీన్ పూర్తయ్యేది. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో పాత్రలు ఒక సినిమాలో చక్కగా, మరొక చిత్రంలో కాస్త లావుగా, మరికొన్ని సన్నివేశాల్లో మరీ భారీ కాయంగా కనిపించాల్సి వచ్చినపుడు నటీనటులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామూలు నటీనటులకే కాదు పెద్ద హీరోహీరోయిన్లకు కూడా ఇలాంటి తిప్పలు (నచ్చిన పనులు) తాము అనుకున్న సినిమాలోని క్యారెక్టర్స్ చేయాలంటే పద్ధతి ప్రకారం ఎక్సర్‌సైజ్‌లు, బాడీ బిల్డింగ్‌లు ఆహారపు అలవాట్లు మార్చుకోక తప్పడంలేదు. హీరోలనే భారీకాయులుగా చూపించడమే కాకుండా, కథనుబట్టి హీరోయిన్లను కూడా చూయించాల్సి వస్తుంది.
సినిమాలంటే కేవలం మేకప్ మాత్రమే కాదు. ఆ మేకప్ వెనుక కఠోర శ్రమ, కార్యదక్షత, త్యాగం వుంటాయి. మనకు నచ్చకపోయినా జనాలకోసం పేరుకోసం చేయాల్సి వుంటుంది. మేకప్ గదుల్లో కొన్ని గంటలు వుండాల్సి వుంటుంది. ఒక సినిమాలో మొదటి సీన్‌లో ముఖం ఎలా కనపడుతుందో అదే ముఖం చివరి వరకు అలాగే వుండాలి. అలా వుండాలంటే హెయిర్‌స్టయిల్, మీసాలు, గెడ్డం, కనుబొమలు, హీరోయిన్లకైతే మేకప్ చాలా ఎఫెక్టివ్‌గా వుండాలి. కాస్ట్యూమ్స్ కూడా బాడీకి తగ్గట్టుగా వుండాలి. లేకుంటే మనిషిని కాస్ట్యూమ్స్ డామినేట్ చేసే అవకాశం వుంది.
బాడీని డెవలప్ చేయడానికి ఎంత కష్టపడాలో మళ్లీ వెనుకటి స్థితికి, ఫిట్‌నెస్‌గా వుండటానికి అంతకంటే ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. వీటికోసం వారికి ఇష్టమైనవాటిని కొంతకాలం పక్కన పెట్టాలి. బరువు పెంచడం, తగ్గించడం చిరంజీవి, ప్రభాస్, తారక్, ఎన్టీఆర్‌కు ఎవరికీ మినహాయింపు కాదు. ఎందుకంటే వారు కోరుకున్న సినిమాలు, పేరు తెచ్చే పాత్రలు చేయాలంటే చిన్న చిన్న కష్టాలు తప్పవు. వాటిని నటీనటులు కష్టంగా తీసుకోరు. ఎందుకంటే వారు నచ్చిన పాత్రకోసం వాళ్ల శరీరాల్ని కొంత హింసించుకోక తప్పదు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తుంటే ప్రేక్షకులు కూడా బోర్‌గా ఫీలవుతారు. కాబట్టి ప్రత్యేక పాత్రలు కూడా నటీనటులు విలక్షణమైన పాత్రలు పోషించాలి కాబట్టి ఇబ్బందులెదురైనా చాలా ఇష్టంతోనే నచ్చిన సినిమా కోసం నచ్చిన పాత్రల కోసం స్టార్‌డమ్ వున్న హీరోలు, హీరోయిన్లు వారు కోరుకుంటున్న హింసే అని చెప్పవచ్చు. బరువులను కరిగించడమేమీ స్టార్‌లకు బాధ కాదు. హీరోయిన్లు నాజూగ్గా కనిపించడం కోసం విపరీతమైన ఎక్సర్‌సైజులు చేస్తారు. విక్రమ్ కూడా సినిమా కోసం రిస్క్ తీసుకున్నాడు. నటులు మేకప్ విషయాల్లో ఎంత రిస్క్ తీసుకుంటారంటే విలక్షణ నటుడు కమల్‌హాసన్ దశావతారం, విచిత్ర సోదరులు సినిమాల్లో- పలు క్యారెక్టర్లు చేసిన గొప్ప నటుడు. అక్కినేని కూడా ఒక సినిమాలో పది పాత్రలు చేయడం ఒక గొప్ప అనుభూతి. ఎప్పటికప్పుడు పాత్రలకు తగినట్లుగా మేకప్ వేసుకోవడం, బాడీ లాంగ్వేజీ మార్చడం చాలా కష్టం ఇలాంటి నటులకు హ్యాట్సాఫ్! ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినట్లయితే అభిమానుల ఆదరణలో ఇవేమీ కనిపించవు.

- సుమశ్రీ