ప్రేమలో పడ్డానంటున్న రెజీనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న రెజీనాకు ఈమధ్య అవకాశాలు బాగా తగ్గాయి. పైగా వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. అవకాశాలు వస్తున్నాకానీ, ఎందుకో కొన్ని సినిమాలకు నో చెప్పడం షాక్ ఇస్తోంది. రెజీనా ఈమధ్య సినిమాలు కూడా కావాలనే బాగా తగ్గించిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఈ భామ స్పందిస్తూ.. నటిని కావాలన్నది నా కోరిక.. అందుకే పరిశ్రమకు వచ్చాను.. నటిగా నిరూపించుకున్నాను.. కానీ ఈ పదేళ్ల కెరీర్‌లో ఎన్నో మలుపులు చూసాను.. ఈమధ్య నేను సినిమాలను తగ్గించానని అంటున్నారు. నిజమే.. దానికి కారణం- ఈమధ్యే నేను ప్రేమలో పడడం అనే పొరపాటువల్లే జరిగిందని షాక్ ఇచ్చింది.
ప్రస్తుతం నా దృష్టి కెరీర్‌మీదే వుందని. ఇకపై వరుసగా సినిమాలు చేస్తానని.. నేనేంటో నిరూపించుకుంటానని చెప్పింది.. అంతా బాగానే వుంది కానీ ఈ అమ్మడికి ప్రేమలోకి దింపిన అతగాడు ఎవరా అన్నది తేలాల్సి వుంది మరి.