పొలిటికల్ సినిమాలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ మొత్తానికి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక రజనీకాంత్ నెక్స్ట్ సినిమాలు చేయడా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. మరోవైపు రోబో 2.0 రజనీకాంత్ లాస్ట్ సినిమా అంటూ కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న కాలా సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ రెండు సినిమాలు విడుదల తరువాత రజనీ మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అయితే ఈసా రి ఆయన చేసే సినిమా పూర్తి స్థాయి రాజకీయ డ్రామాగా వుంటుందని టాక్? ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరిగాయట. పొలిటికల్ డ్రామా అయితే తన రాజకీయాలకు ఇంకా హెల్ప్ అవుతుందని భావించిన రజనీ ఈ సినిమాను ఒప్పుకున్నాడు. అన్నట్టు ఈ సినిమా కథ కూడా పా రంజిత్ వినిపించాడట. కథ బాగా నచ్చడంతో ఓకె చెప్పాడట. మొత్తానికి కబాలి సినిమాతో పా రంజిత్ అంటే రజనీతో ఎక్కువ అనుబంధం పెరిగింది. ఇప్పటికే కాలా సినిమా చేస్తున్న పా రంజిత్, వెంటనే రజనితో మరో సినిమాకు ఒప్పించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.