రంగస్థలం టీజర్ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న మెగా హీరో రామచరణ్ రంగస్థలం సినిమా తాలూకు మరో కొత్త వార్త రావడంతో ఇప్పుడు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్‌లుక్‌తో సందడి చేసిన ఈ మెగా హీరో చిత్రం.. ఇప్పుడు టీజర్ చూపించడానికి సిద్ధమవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా రూపొందుతున్న ‘రంగస్థలం’ సినిమా నిజానికి సంక్రాంతి 2018న విడుదల అవ్వాల్సి వుంది. ఎట్టకేలకు పోస్టుపోన్ అయిపోయి.. చివరకు సంక్రాంతినాడు ఒక ప్రకటన ఇచ్చారు. జనవరి 24.. సాయంత్రం 4.15 నిమిషాలకు ‘రంగస్థలం’ సినిమా టీజర్ విడుదలవుతున్నట్లు ప్రకటించారు. మైత్రీ మూవీస్ వారు మొత్తానికి ఈ న్యూస్ అభిమానుల్లో మాంచి జోష్ నింపుతోంది. గత సంవత్సరం కాలంగా షూటింగ్‌లో ఉన్న ‘రంగస్థలం’ గ్రామీణ నేపథ్యంలో సాగే కథ.. రామ్‌చరణ్‌కు జోడీగా సమంత నటిస్తుండగా.. ఇప్పటికే లీకైన వారి ఫొటోలు.. వీరిమధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో చెబుతున్నాయి. జగపతిబాబు, ఆది కీలక పాత్రలను పోషిస్తుంటే.. యాంకర్ అనసూయ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో మెరవనుందట.