బాలీవుడ్‌పై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతోన్న రకుల్ ప్రీత్‌సింగ్, మరోపక్క తమిళ, హిందీ చిత్రాలపై కూడా దృష్టిపెట్టింది. తమిళంలో అగ్ర కథానాయకుల సరసన అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో తమిళంలో సూర్య జోడీగా ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంది. హిందీలోనూ మరో భారీ ఛాన్స్‌ను పట్టేసిందనేది తాజా సమాచారం. ఆల్‌రెడీ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన రకుల్ చేసిన ఓ సినిమా వచ్చేనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగానే ఆమెకి అజయ్ దేవ్‌గన్ జోడీగా చేసే మరో ఛాన్స్ వచ్చింది. రంజన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రకుల్ సిటీ అమ్మాయిగా చాలా మోడ్రన్‌గా కనిపిస్తుందట. ఆమె స్వభావం కూడా డిఫరెంట్‌గా వుంటుందని అంటున్నారు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లి.. దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.