ఆ కల ఇలా నిజమైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురంలో సరదాగా తిరిగే గోపి అనే కుర్రాడు ఓ పర్సన్‌కోసం హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ అతను ఎదుర్కొన్న పరిణామాలు ఏంటనేది తెలియాలంటే ‘ఇగో’ చిత్రాన్ని చూడాల్సిందే అంటున్నారు హీరో ఆశీష్ రాజ్. సుబ్రమణ్యం దర్శకత్వంలో ఆశీష్‌రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘ఇగో’. ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆశీష్‌రాజ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ- నటన అంటే చిన్నప్పట్నుంచే ఇష్టం. 4వ తరగతిలో నటించే ఛాన్స్ వచ్చింది. రావణుడి పాత్ర వేశాను. పలు యాడ్స్‌లో నటించాను. అటునుంచి సినిమాలవైపు వెళ్లాలని కలలు కన్నాను. ఆ కల ఇలా నిజమయంది. మహేష్‌బాబుతో కలిసి ఓ యాడ్ ఫిల్మ్‌లో నటించా. కానీ అందులో నేను పెద్దగా కనిపించలేదు. అలాగే ఓ సినిమాలోనూ నటించాను. అది విడుదల కాలేదు. ఆకతాయ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాను. హీరోగా ‘ఇగో’ నాకు రెండవ చిత్రం. ఇద్దరు ఇగోయిష్టుల ప్రేమకథ ఇది. ఇందులో నేను గోపిగా కనిపిస్తా. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి చెందిన అమ్మాయి ఇందు పరిచయమవుతుంది. మేం టీజింగ్ చేసుకుంటూ ఉంటుంటాం. ఓ టైమ్‌లో మా ఇగోలు దెబ్బతింటాయి. నీకంటే రిచ్ అబ్బాయిని పెళ్లిచేసుకుంటా అని ఆమె, నీకంటే అందమై అమ్మాయిని చేసుకుంటా అని నేను ఒకరినొకరు వాదించుకుంటాం. ఈ క్రమంలో నేను ఓ సోషల్ కాజ్‌కోసం హైదరాబాద్‌ వస్తాను. అక్కడ చోటు చేసుకున్న ట్విస్ట్‌వల్ల జీవితమే మారిపోతుంది అని అన్నారు.