నాగార్జున మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తదనాన్ని అందించడంలో నాగ్ స్టయలే వేరు. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా భాషా భేదం లేకుండా ఎప్పటినుంచో మల్టీస్టారర్లు చేస్తున్నారు నాగ్. మల్టీస్టారర్లు పూర్తిగా మరుగునపడిపోయిన సమయంలో మోహన్‌బాబుతో అధిపతి, శ్రీకాంత్‌తో నినే్న ప్రేమిస్తా లాంటి సినిమాలు చేశాడు. నాగ్ హిందీ, తమిళ భాషల్లోనూ వేరే హీరోలతో కలిసి నటించాడు. ఈమధ్యే తమిళ యువ కథానాయకుడు కార్తితో కలిసి నటించిన ‘ఊపిరి’ మంచి ఫలితాన్నందించింది. ఇప్పుడు నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయడానికి నాగ్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌మీదకి వెళ్లకముందే నాగ్ పేరుతో మరో మల్టీస్టారర్ వార్తల్లోకి వచ్చింది. అందులో నాగార్జునతో కలిసి నటించే కథానాయకుడంటూ ప్రచారంలో వున్న హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తమిళంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్‌తో కలిసి నాగ్ ఓ మల్టీ లాంగ్వేజ్ మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా తీసేదెవరన్నది తెలియరాలేదు. కానీ ఇద్దరూ కలిసి ఓ కథ గురించి చర్చించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇదే నిజమైతే ఇటు నాగ్ అభిమానులు.. అటు ధనుష్ అనిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే..