ఇద్దరూ ఇద్దరే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్వరలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి తరువాత రాజవౌళి తెరెకెక్కించే సినిమా ఇదే. మెగా హీరో రామ్‌చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించే ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా దసరాకు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట రాజవౌళి. ప్రస్తుతం అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక రాజవౌళి ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సీరియస్‌గా పనిచేస్తున్నారట. ఎందుకంటే ఇద్దరు క్రేజీ స్టార్స్‌తో తీస్తున్న సినిమా కాబట్టి అంచనాలు కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి మరి! వాటిని అందుకోవాలంటే ఆ రేంజ్ స్క్రిప్ట్ ఉండాల్సిందే. అయితే తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా.. ‘ఇద్దరు.. ఇద్దరే’నట! అప్పట్లో అక్కినేని హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున కలిసి నటించిన సినిమా అది. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల గాసిప్స్ వస్తున్నాయి. మరి ఇందులో ఏది కరెక్ట్ అన్న విషయాన్ని రాజవౌళియే చెప్పాలి..!