పోలీసులకు స్ఫూర్తినిచ్చే కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ ఆఫీసర్ తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడన్నదే ‘టచ్ చేసి చూడు’ కథ అని అంటున్నాడు దర్శకుడు విక్రమ్ సిరికొండ. రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ హీరో హీరోయిన్లుగా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీ నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ సిరికొండ చిత్ర విశేషాలను వివరిస్తూ - నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజనీరింగ్ చేశా. సినిమాలపై ఆసక్తితో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో రచయితగా మారాను. ఠాగూర్ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. బన్నీ, సాంబ తదితర చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశాను. దర్శకుడిగా ఛాన్స్‌లకోసం తిరుగుతున్న క్రమంలో ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. వక్కంతం వంశీ అందించిన కథను అంతే అందంగా తెరపై ఆవిష్కరించాం. మనం చేసే పని మనకంటే గట్టిగా మాట్లాడుతుందని నా నమ్మకం. అలాగే ఈ సినిమా నాకంటే బాగా మాట్లాడుతుందని నమ్ముతున్నా. జీవితంలో సమతూకం ఉండాలనేది నిజం. అదే విషయాన్ని ఈ సినిమాలో చెప్పబోతున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాలెన్స్ మిస్ అయితే గొడవలవుతాయి. అలాగే రెండు దేశాలమధ్య బ్యాలెన్స్ మిస్ అయితే యుద్ధం జరుగుతుంది. ఓ డెడికేట్ పోలీస్ ఆఫీసర్ తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడో ఈ సినిమా చెబుతుంది. రెండు కాలాల్లో సాగే చిత్రమిది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. రవితేజ ద్విపాత్రాభినయం చేయలేదు. ఒకే పాత్రను రెండు డిఫరెంట్ పీరియడ్స్, బ్యాక్‌డ్రాప్స్ మధ్య చేశారు. ఇప్పటివరకు రవితేజ చేసిన పోలీసు పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎమోషనల్ టచ్ వున్న పోలీసు అధికారి పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఇందులోని పోలీస్ పాత్ర డిపార్టుమెంట్‌ను ఇన్‌స్పైర్ చేస్తుందని నమ్ముతున్నా. రైటర్‌గా నేను లవ్, ఎమోషనల్ సన్నివేశాలను బాగా రాయగలను. ఇందులో ఆ ఎలిమెంట్స్ మిస్‌కాకుండా చూసుకున్నా. ‘మిరపకాయ’ చిత్రం నుంచి రవితేజతో మంచి అనుబంధం ఉంది. కథానాయికలు రాశీఖన్నా, సీరత్‌కపూర్ పాత్రలు సినిమాలో కీలకంగా వుంటాయి. విడుదలయ్యాక ఇద్దరి పాత్రలకు మంచి పేరొస్తుంది అన్నారు.