ఆడియోలో ‘దివ్యమణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేష్ కమల్, వైశాలి, కిమయా హీరో హీరోయిన్లుగా మెహమాయా ఎంటర్‌టైన్ మెంట్స్, రెడ్‌నోడ్ మీడియా బ్యానర్లపై గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దివ్యమణి’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నర్తకి, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత యామిని కృష్ణమూర్తి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో సురేష్ కమల్ మాట్లాడుతూ - నటుడిగా ఇది నా తొలి చిత్రం. ప్రపంచమంతా యోగా నేర్పడం కోసం తిరిగిన నాకు తెలుగునేలంటే ఇష్టం. గిరిధర్ చెప్పిన కథ నచ్చడంతో హీరోగా నటిస్తున్నాను. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాల్లో రియల్‌గా చేశాను. తప్పకుండా ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది అన్నారు. దర్శక, నిర్మాత గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ - మనిషి తనని తాను జాగృతి పరుచుకోవడానికి సృజనాత్మకత ఎంతో అవసరం. ఆ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని చేశాను. సినిమాలో పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. అందరికీ నచ్చే కథ, కథనాలతో తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత యామిని కృష్ణమూర్తి జీవిత కథతో ఓ చిత్రాన్ని చేయనున్నాం అన్నారు. యామిని కృష్ణమూర్తి మాట్లాడుతూ - ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా వుంది. తప్పకుండా ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్-లక్ష్మణ్, ప్రాడికూన, సాయికుమార్, బలభద్రపాత్రుని రమణి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.