తొలిప్రేమ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ‘తొలిప్రేమ’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ - ఈ సినిమా కోసం ఏ టైటిల్ పెడదామా అని ఆరు నెలలుగా ఆలోచించాం. దాంతో దర్శకుడు వెంకీ ‘తొలిప్రేమ’ టైటిల్ పెడదామని చెప్పారు. నాకు ఇష్టమున్నా కొద్దిగా భయమేసింది. ఆ టైటిల్ పెట్టుకుని ఏదైనా తేడాచేస్తే పరిస్థితులు మరోలా వుంటాయి అని అన్నాను ఎందుకంటే అది బాబాయ్ బ్రాండ్ మార్క్ చిత్రం. తప్పకుండా అప్పటి ‘తొలిప్రేమ’ను ప్రేక్షకులు ఎలా ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా తప్పకుండా ఆదరిస్తారు. నా మనసుకు దగ్గరైన కథ. థమన్ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో నా హైట్‌కు సరిపోయేలా హీరోయిన్‌గా రాశీఖన్నా కుదిరింది అన్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ - నేను పరిశ్రమకొచ్చిన తొలిరోజుల్లో నన్ను నమ్మిన వ్యక్తి ఈ రోజు పరిశ్రమ నన్ను నమ్మేలా చేసిన వ్యక్తి దిల్ రాజు. ఈ కథ చెప్పినప్పుడు వరుణ్‌కైతే బావుంటుందని ఆయన చెప్పారు. వరుణ్‌కి కథ వినిపించాను. చాలా ఎగ్గయింటింగ్ అయ్యాడు. ఈ సినిమాతో మా నమ్మకాన్ని నిలబెట్టిన వ్యక్తి బాపినీడు. థమన్ చాలా కష్టపడ్డాడు. కెమెరామెన్ జార్జ్ నేను కన్న కలలను అందంగా తెరపై ఆవిష్కరించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ - పవన్ కళ్యాణ్‌కు సంచలన విజయాన్ని అందించిన ‘తొలిప్రేమ’ టైటిల్‌తో వరుణ్‌తేజ్ చేస్తున్న ఈ ‘తొలిప్రేమ’ మంచి విజయాన్ని అందుకుని హీరోగా వరుణ్‌కి కూడా మంచి బ్రేక్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాశీఖన్నా, థమన్, దిల్ రాజు పాల్గొన్నారు.