సినిమా సమాజంలో భాగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కాకతీయ కళా వైభోత్సవాల పేరుతో ‘కళాబంధు’ టి. సుబ్బిరామిరెడ్డి కళలను ప్రోత్సహిస్తూ కళాకారులను సత్కరిస్తూ కళల పట్ల, సంస్కృతి పట్ల తన గౌరవాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు పాపారావు సినీ నటులను సత్కరించకూడదని విమర్శిస్తూ మాట్లాడడం సంచలనం రేపుతోంది. ఈ విషయంపై ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందిస్తూ- ‘‘ సుబ్బిరామిరెడ్డిగారు కాకతీయ కళా వైభవాలు పేరుతో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ రాష్టమ్రంతటా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ పాపారావు సినిమా నటీనటులను సత్కరించొద్దంటూ విమర్శించడం బాధాకరం. సినిమా కూడా సమాజంలో భాగమే. ప్రజలతో మమేకమైన కళ సినిమా. సినిమా కళాకారులు తొలినాళ్లనుండి ప్రజల పట్ల స్పందిస్తూ పలు సహాయ కార్యక్రమాలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి గొప్ప సినిమా రంగానికి చెందిన సినీ నిర్మాత టి.సుబ్బిరామిరెడ్డి సినిమా నటీనటులను సన్మానించే భాగంలో తొలుతగా మోహన్‌బాబుగారిని సత్కరించారు. ఇంకా ఎన్నో చోట్ల మరెన్నో వైవిధ్యమైన కార్యక్రమాలు జరగాల్సి వున్న ఈ సమయంలో పాపారావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విచారకరం. ఒక వైపు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలుగు భాషకు మరింత గౌరవాన్ని తెచ్చే విధంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి తనదైన ఔనత్యాన్ని చాటి తెలుగు భాషకు ఎల్లలు లేవు. కళకు సరిహద్దులు, బాషాభేదం లేదనే రీతిలో తెలుగు సినీ నటీనటులను ఆహ్వానించి గొప్పగా ఘనంగా సన్మానించారు. అలాగే మంత్రి కేటీఆర్ కూడా ప్రతీ నటుడిని పేరుపేరునా పలకరిస్తూ తనదైన అభిమానాన్ని చాటుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా నటీనటుల పట్ల ఎంతో అభిమానాన్ని కురిపించారు. ఏ సహాయానికైనా వెనుకాడకుండా ఆదరిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగు నటుడు గుండు హన్మంతరావు అనారోగ్య పరిస్థితులు తెలుసుకొని సీఎం రిలీఫ్ నుండి ఐదు లక్షల రూపాయలను కేటీఆర్ అందించారు. సినిమా నటీనటుల పట్ల తన గౌరవాన్ని చాటుకున్న కేసీఆర్‌గారి పరిపాలనకు కృతజ్ఞతలు. ఇలాంటి సమయంలో పాపారావు సినీనటులపై విమర్శలు చేయడం ఎంత వరకు సబబు? అన్నది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం’’అని పేర్కొన్నారు.