‘టీచ్ ఎయిడ్స్’ కోసం గళం విప్పిన నటులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం టీచ్ ఎయిడ్స్ ఇండియా ట్రస్ట్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వయసుల విద్యార్థినీ విద్యార్థులకు హెచ్.ఐ.వి. ఎయిడ్స్‌పే అవగాహన పెంచేందుకు యానిమేటెడ్ మల్టీమీడియా ఇంటరాక్టివ్ హెచ్.ఐ.వి. ఎడ్యుకేషన్ పేరుతో రూపొందించిన సీడీని సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ యానిమేషన్ ఫిలిమ్‌లో తమ పాత్రలకు 22 మంది భారతీయ సినీ నటులు తమ వాయిస్‌ను అందజేశారు. టచ్ ఎయిడ్ వ్యవస్థాపకురాలు, సిఇవో డా.పియాసర్కార్, ట్రస్టీ అక్కినేని అమల, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ జయేష్‌రంజన్, అగ్రికల్చరల్ కోఆపరేషన్ సెక్రటరీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. యువతీ యువకులంతా హెచ్.ఐ.వి. విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పకుండా తెలుసుకోవాలని, ‘టీచ్ ఎయిడ్స్’ ద్వారా ఎంతో విలువైన ఎడ్యుకేషన్ మెటీరియల్‌ను ఉచితంగా విద్యార్థులకు అందజేస్తున్నారని అన్నారు. టీచ్ ఎయిడ్స్ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ ఈ వీడియోకోసం ఎంతో రీసెర్చ్ చేశామని, హెచ్.ఐ.వి. ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎవరికైతే అవసరమో వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉపయోగించుకోవచ్చునని, ఈ వీడియోను తయారుచేయడంలో ప్రముఖ నటీనటులు తమ తమ వాయిస్‌ని ఇచ్చి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ వీడియోకి వాయిస్ ఇచ్చిన నటీనటులు. అమితాబ్‌బచ్చన్, నాగార్జున, అనుష్క, సుదీప్, శృతిహాసన్, షబనాఅజ్మీ, సూర్య, సుహాసిని, సిద్ధార్థ, స్వాతి, ఇమ్రాన్‌ఖాన్ తదితరులు ఉన్నారు.