ఆస్కార్ గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ క్రేజీ భామ ప్రియాంక చోప్రాకు ఓ అరుదైన గౌరవం దక్కింది. 90వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో వున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు ప్రియాంకను ఆస్కార్ కమిటీ ఎంపిక చేయడం విశేషం. ‘బిహైండ్ ద సీన్స్ విత్ ప్రియాంక చోప్రా’. మంగళవారం ఉదయం 5.22 ని.లకు ఆస్కార్ అభ్యర్థుల ఎనౌన్స్‌మెంట్ అంటూ ఆస్కార్ కమిటీ సభ్యులు రెబెల్ విల్సన్, మిచెల్లి రాడ్రిగ్, రోసారి డాసన్ తమ అధికార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. క్వాంటికో టెలివిజన్ సీరిస్‌తో హాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన ప్రియాంకకు మరోసారి ఆస్కార్ వేదికపై మెరిసే అవకాశం రావడం విశేషం. 2016లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా అద్భుతమైన కాస్ట్యూమ్స్‌తో ప్రియాంక రెడ్ కార్పెట్‌పై హల్‌చల్ చేసిన విషయం విదితమే.